CSS Drop Down Menu
Showing posts with label Tech Tips. Show all posts
Showing posts with label Tech Tips. Show all posts

Wednesday, August 8, 2018

బ్లూ వేల్ లాంటి "డెడ్లీ గేమ్" మరొకటి వచ్చేస్తోంది? జాగ్రత్త !

బ్లూ వేల్ గేమ్ ఎంత డేంజరో తెలిసిందే. ఈ బ్లూవేల్ గేమ్ కొంతమంది చిన్నారుల ఆత్మహత్యకు కారణమైంది. ఈ గేమ్‌పై భారత్‌తో పాటు కొన్ని దేశాలు నిషేధం విధించిన నేపథ్యంలో.. తాజాగా అలాంటి డెడ్లీ గేమ్ మరొకటి కొంపముంచేందుకు వచ్చేస్తోంది. ఇంకా సోషల్ మీడియాలో అది కాస్తా వైరల్ అవుతోంది. యువతనే లక్ష్యంగా ''మోమో గేమ్‌'' పేరుతో సూసైడ్‌ ఛాలెంజ్‌ను విసురుతున్నారు కొందరు కేటుగాళ్లు. 




ప్రస్తుతం వాట్సాప్‌లో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ఆన్‌లైన్‌ గేమ్‌కు ఓ వికృత రూపంతో కూడిన ముఖాన్ని జోడిస్తున్నారు. పక్షి కళ్లు మనిషి ముఖం కలిసున్న భయంకరమైన ఈ బొమ్మను చూస్తేనే జడుసుకుంటారు. ప్రస్తుతం సైబర్ మాయగాళ్లు మోమో ఛాలెంజ్ అనే గేమ్‌ను క్రియేట్ చేశారు. ఈ గేమ్‌లో భాగంగా తొలుత వాట్సాప్‌‌ మోమో పేరుతో ఓ మెస్సేజ్‌ వస్తుంది. దానికి మనం రిప్లై ఇచ్చామా అంతే వారి వలకు చిక్కినట్లే. బ్లూ వెల్‌ ఛాలెంజ్‌ లాగే ఇక్కడ కూడా రకరకాల టాస్కులిచ్చి మనల్ని వారి గుప్పిట్లోకి లాక్కుంటారు. 

మొదట్లో తెలియని నెంబర్ల నుంచి మెస్సేజ్‌లు రావడం రిప్లై ఇవ్వాలంటూ ఛాలెంజ్‌లు విసరడం ఆ తర్వాత పూర్తి చేయాలంటూ ఇంట్రెస్టింగ్ టాస్కులు పంపించడం జరుగుతుంది. అయితే ఛాలెంజ్‌ను ఒప్పుకుని మధ్యలో నిలిపేసినా లేకపోతే టాస్క్‌ను పూర్తి చేయలేకపోయినా బెదిరింపు సందేశాలు కూడా పంపిస్తుంటారు. టీనేజర్స్‌ ఇష్టంగా ఆడే గేమ్స్‌ నుంచి చివరకు వారిని ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసే లాస్ట్‌ టాస్క్‌ వరకు ఈ మృత్యుక్రీడ ఉంటుంది. చిట్టచివరన ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆ దృశ్యాలను వీడియో తీయాలి. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే మోమో గేమ్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసినట్టే. 

ఈ గేమ్‌లో భాగంగా వారం క్రితం అర్జెంటీనాలో ఓ అమ్మాయి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా పోలీసులు ఆమె ఫోన్‌ను హ్యాక్‌ చేస్తే ఆమె మోమో గేమ్‌ ఆడినట్లు తేలింది. అప్పుడే మోమో ఛాలెంజ్‌ అనేది ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆత్మహత్య సంబంధించిన దృశ్యాలను వీడియో కూడా తీసింది. 

మోమో గేమ్‌ ప్రభావం మాత్రం అర్జెంటీనా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో తీవ్రంగా కనిపిస్తోంది. మనదేశానికైతే ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వకపోయినా పోలీసులు మాత్రం హెచ్చరిస్తున్నారు. ఇది ఆన్ లైన్ గేమ్ కావడంతో ఇంకా భారత్ లోకి రాలేదని నమ్మకంగా చెప్పే పరిస్థితి మాత్రం లేదు. ఇలాంటి ఘటనలు వెలుగు చూడకుండా వుండాలంటే ఈ గేమ్‌కు దూరంగా వుండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Friday, April 13, 2018

టెక్ ప్రపంచంలో సరికొత్త విప్లవం?వాయిస్ అసిస్టెంట్!

టెక్ ప్రపంచంలో మెల్లిగా దూసుకువెళుతున్న వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ రానున్న కాలంలో అత్యంత పాపులర్ కానుంది. అందులో భాగంగా గూగుల్ సరికొత్త వ్యూహాలతో ముందుకు దూసుకోస్తోంది. దానికి తగ్గట్లుగా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తోంది. 

గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ తో పాటు పాటలు, అలాగే ఆన్ లైన్ స్ట్రీమ్స్ సర్వీసులను అందించే విధంగా గాడ్జెట్లను రెడీ చేస్తోంది. అమెజాన్ ఈకో ఇప్పటికే మార్కెట్లో ఇలాంటి ఫీచర్లను అందిస్తున్న నేపథ్యంలో గూగుల్ కూడా సరికొత్త గాడ్జెట్లతో ముందుకొచ్చింది. హోమ్ బేస్డ్ స్మార్ట్ స్పీకర్లను గూగుల్  దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.



గూగుల్ హోమ్ పేరుతో ఉన్న స్పీకర్ ధర రూ.9,999. గూగుల్ హోమ్ మినీ ధర రూ.4,499. గూగుల్ హోమ్ బరువు 477 గ్రాములు. పవర్ అడాప్టర్ తో పాటు వస్తుంది. 142.8 ఎంఎం పొడవు, 96.4 ఎంఎం వ్యాసార్థంతో ఉండే స్పీకర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ పరికరాలకు అనువుగా ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ సాయంతో వాయిస్ ఆధారితంగా పనిచేస్తుంది.

'హే గూగుల్' లేదా 'ఓకే గూగుల్' అని చెబితే చాలు పనిచేస్తుంది. వైఫై ద్వారా ఈ స్పీకర్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. పవర్ అడాప్టర్ సాయంతో ప్లగ్ కు అనుసంధానం చేసి మాత్రమే వాడుకోగలరు. అంతేకాదు దీంతో ఇంటిని స్మార్ట్ గా మార్చుకోవచ్చు. స్మార్ట్ లైట్లు ఉంటే 'ఓకే గూగుల్.. స్విచ్ ఆన్ లైట్స్' అని చెబితే చాలు లైట్లు ఆన్ అవుతాయి. గూగుల్ హోమ్ యాప్ ద్వారా ఇంట్లోని స్మార్ట్ పరికరాలను కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్పీకర్లకి లైట్లతో కూడిన ఇండికేషన్స్ ఉంటాయి. వాయిస్ కంట్రోల్ చేసుకునే సమయంలో ఈ లైట్లు సహకర్తిస్తాయి. గ్రే అండ్ వైట్ కలర్స్లో ఇవి యూజర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ స్పీకర్లకి మ్యూట్ ఆప్సన్ అలాగే ఇతర ఫీచర్ల కూడా ఉన్నాయి. గూగుల్ అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. మీ దైనందిన కార్యకలాపాలకు ఈ స్పీకర్ లో ఉండే అలారం బాగా ఉపకరిస్తుందని గూగుల్ చెబుతోంది. మరిన్ని వివరాలు కోసం ఈ క్రింది లింకులపై క్లిక్ చేయండి.

Google Home:- http://fkrt.it/HSnMpLuuuN 

Google Home Mini:- http://fkrt.it/rmbx02NNNN 


Wednesday, November 15, 2017

"మీ పేరు" తోనే "రింగ్ టోన్" పెట్టుకోవాలని ఉందా ?

మీరు మీ ఫోన్లో రకరకాల రింగ్ టోన్స్ పెట్టుకొని ఉంటారు. కాని  "మీ పేరు" తోనే "రింగ్ టోన్"  పెట్టుకొని మీ పక్కవారిని ఆశ్చర్య పరచాలని  ఉందా ? ఐతే ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసి మీ రింగ్ టోన్ సెట్ చేసుకొని ఆనందించండి. 

      


Tuesday, November 14, 2017

"తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్" తో వచ్చిన "మోటో x4"


అందరూ అనుకున్నట్లుగానే మోటో ఎక్స్ 4 ఇండియాకి వచ్చేసింది.



ఇందులో యూజర్లను ఆకట్టుకునే స్టన్నింగ్ ఫీచర్లతో తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందించారు.
మోటో అలెక్స్ యాప్ కూడా ఇందులో ఉంది.ఫోన్ టచ్ చేయకుండానే అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నీళ్లలో పడినా ఏ మాత్రం కంగారు పడక్కర్లేదు. రక్షణ కవచం ఉంది. అత్యాధునిక ‘డ్యుయల్‌ రేర్‌ కెమెరా సిస్టం’తో అదిరే ఫొటోలు తీయొచ్చు. 12 మెగాపిక్సల్‌ కెమెరాతో ‘డ్యుయల్‌ ఆటోఫోకస్‌ పిక్సల్‌ టెక్నాలజీ’ని వాడుకుని తక్కువ వెలుతురులోనూ క్వాలిటీ తగ్గని ఫొటోలు క్లిక్‌ మనిపించొచ్చు.అల్యూమినియం బాడీతో ఈ ఫోన్‌ పూర్తిగా గ్లాస్ లుక్ వచ్చేలా డిజైన్ చేశారు. ఈ లుక్ రావడంతో ఫోన్ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించే విధంగా ఉంది.

ఫోన్  స్పెసిఫికేషన్లు:-
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
3,4 జీబీ ర్యామ్ /32,64 జీబీ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12,8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్
ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ (ముందు, వెనుక)
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్. 

Moto x4 
3 జీబీ ర్యామ్ /32 జీబీ స్టోరేజ్ - http://fkrt.it/xQpTG!NNNN
4 జీబీ ర్యామ్ /64 జీబీ స్టోరేజ్ - http://fkrt.it/kVYn~TuuuN




Friday, November 3, 2017

Redmi ఫోన్ లో వచ్చే "Female For English" అనే నోటిఫికేషన్ ఎలా తొలగించాలో తెలుసా?


Redmi ఫోన్ లో వచ్చే "Female For English" అనే నోటిఫికేషన్ మీరు  క్లోజ్ చేసినా అది మళ్ళీ మళ్ళీ వచ్చి చిరాకు తెప్పిస్తుంది. అది మళ్ళీ రాకుండా ఉండాలంటే ఈ క్రింది వీడియోలో చూపిన విధంగా చేసి ఆ  నోటిఫికేషన్ రాకుండా చేసుకోండి. 



Thursday, August 17, 2017

మనకు ఇష్టమైన "భాష‌" నేర్పే "స్మార్ట్ నెక్లెస్"!

మ‌నం ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలంటే ఎక్కువ‌గా పుస్త‌కాల మీద ఆధార‌ప‌డ‌తాం. 30 రోజుల్లో ఫ‌లానా భాష‌ను నేర్చుకోవ‌డం ఎలా? అనే పుస్త‌కాన్ని కొనేస్తాం. లేదంటే ఆన్ లైన్ లో లాంగ్వేజ్ లెర్నింగ్ ట్యుటోరియ‌ల్స్ పై ఆధార‌ప‌డ‌తాం. కానీ, మ‌నం ఎవ‌రితో అయినా ఆ భాష‌లో సంభాషిస్తే దానిని మనం త్వ‌ర‌గా నేర్చుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ, అన్ని సార్ల మ‌న‌తో ఆ భాష‌లో సంభాషించేవారు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు. అటువంటి ప‌రిస్థితుల్లో మ‌న‌కు భాష నేర్పేందుకు ఓ సరికొత్త గ్యాడ్జెట్ ను రూపొందించారు. 

Mersiv అని స్మార్ట్ నెక్లెస్ మ‌న మెడలో వేసుకుంటే చాలు. ఎంచ‌క్కా మ‌న‌కు కావాల్సిన భాష‌ను నేర్చుకోవ‌చ్చు, ఆ భాష‌లో సంభాషించ‌వ‌చ్చు.  ఆ నెక్లెస్ లో అమర్చిన అత్యాధునిక కెమేరా ఎదురుగా ఉన్న వస్తువులు, వ్యక్తుల ఫొటోలు తీసి అందుకనుగుణంగా అప్పటికప్పుడు మనతో సంభాషణలు జ‌రుపుతుంది. ఇందులోని కెమేరా 140 డిగ్రీల కోణంలో ఫొటోల‌ను తీస్తుంది. ఈ హారానికి అనుసంధానించిన ఇయర్‌బడ్స్‌ చెవుల్లో పెట్టుకోవాలి. మనం టమాటో చేతిలో పట్టుకొని ఉంటే ‘టామాటోని స్పానిష్‌లో ఏమంటారు?’ అనడుగుతుంది. 

అంతేకాకుండా మ‌నం ఏద‌న్నా అడిగితే దానికి బ‌దులు కూడా ఇస్తుంది. అప్పటికప్పుడే సంభాష‌ణ‌లు చేస్తూ ఓ ట్యూటర్‌లా పనిచేస్తుంది.ఈ గ్యాడ్జెట్ ప‌నిచేయాలంటే మన స్మార్ట్‌ఫోన్‌లో దానికి సంబంధించిన‌ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ ఫోన్లో ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ అందుబాటులో ఉండాలి. మ‌నం వినాల‌నుకునే భాష‌ను ముందుగానే యాప్ లో సెట్ చేసుకోవాలి.  జో మిల్లర్‌ అనే బ్రిటీష్‌ డిజైనర్‌ ఈ సరికొత్త గ్యాడ్జెట్‌ని రూపొందించాడు.

LG Q6 : http://amzn.to/2vL2yYs

Monday, July 17, 2017

ఒకే సైట్ నుండి online ద్వారా pdf ఫైలును 24 రకాలుగా convert చేసుకోవాలనుకుంటే ?


మీరు pdf  నుండి word,jpg,merge,split,compress,watermark లాంటివి ఒకే సైట్ నుండి online ద్వారా  24 రకాలుగా convert చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఈ క్రింది వీడియోలో చూడండి.   



మీరు నా యొక్క youtube app ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది download App లింక్ క్లిక్ చేయండి. 


Wednesday, April 5, 2017

"గూగుల్ క్రోమ్" లో "వెబ్ పేజీ"ని PDF లో సేవ్ చేయడం ఎలాగో తెలుసా ?

గూగుల్ క్రోమ్ లో ఎటువంటి  'EXTENSIONS' ఉపయోగించకుండా  వెబ్ పేజీ ని పిడిఎఫ్ (PDF) లో సేవ్ చేయడం ఎలాగో తెలుసా ? తెలియకపోతే ఈ క్రింది లింక్ ఫై క్లిక్ చేసి చూడండి . మీకు గాని ఈ వీడియో  నచ్చినట్లయితే  మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. 

వీడియో లింక్:- https://youtu.be/6DQopeU5c_k


Saturday, January 28, 2017

మీ PC/LAPTOP లో CHECKING FILE SYSTEM అనే ERROR ఇబ్బంది పెడుతుందా ?

మీ PC/LAPTOP లో ఆన్ చేసిన వెంటనే CHECKING FILE SYSTEM అనే  ERROR ఈ క్రింది చూపిన విధంగా వస్తున్నట్లైతే ,




ఈ క్రింది చూపిన టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే ఈ ERROR ని సులువుగా తొలగించుకోవచ్చు . 

STEP-1

ముందుగా COMMAND PROMPT (CMD) ని SEARCH BAR లో టైప్ చేయండి.  


STEP-2

ఇప్పుడు CMD మీద RIGHT CLICK చేసిన తర్వాత "RUN AS ADMINISTRATOR" ఫై CLICK చెయ్యాలి. 



 STEP-3

పైన చెప్పిన విధంగా చేసినట్లయితే ఈ క్రింది చూపిన ఇమేజ్ (COMMAND PROMPT) ఓపెన్ అవుతుంది. 



 STEP-4

ఇప్పుడు chkntfs /x D: G: అని టైప్ చేసి "ENTER" ఇవ్వాలి .



STEP-5

"ENTER" ఇచ్చిన తర్వాత ఈ క్రింది చూపిన ఇమేజ్ లో లాగ వస్తుంది. 



అప్పుడు CMD BOX ని CLOSE చేసి "RESTART" చేసినట్లయితే మీ సమస్య  తీరిపోతుంది. 

గమనిక:- నేను పైన చూపించింది D,G DRIVE లకు సంబందించినది.  మీ PC/LAPTOP లో ERROR ఏ DRIVE యొక్క LETTER చూపించబడుతుందో అదే  LETTER ని టైప్ చేయండి.  

ఉదాహరణకి మీకు C కనుక చూపిస్తున్నట్లైతే ఈ క్రింది చూపిన విధంగా టైప్ చేయండి.
chkntfs /x C:






Saturday, January 21, 2017

"LETV LE 1S" ఫోన్ లో పవర్ బటన్ నొక్కకుండా లాక్ చేయడం ఎలా ?

సింపుల్  ట్రిక్  ద్వారా "LETV LE 1S" ఫోన్ లో పవర్ బటన్ నొక్కకుండా లాక్ చేయడం ఎలాగో తెలియాలంటే ఈ క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి . 

    

Friday, October 14, 2016

మీ "3G ఫోన్‌" ని "4G ఫోన్‌" గా ఇలా మార్చుకోండి !

ఇప్పుడు ఎక్క‌డ చూసినా 4జి అనే మాట వినిపిస్తోంది. జియో సిమ్ వేసుకోవాలంటే, మీ సెల్ ఫోన్ 4Gయేనా అని అడుగుతున్నారు. కాదు 3జి అంటే, అయితే స‌పోర్ట్ చేయ‌దంటున్నారు... అయినా మీరు బెంగ‌పెట్టుకోవాల్సిన ప‌నిలేదు. మీ ఫోన్ 4జిగా ఇలా మార్చేసుకోవ‌చ్చు.

మొన్నటిదాకా 3G ఫోన్‌కి, 4G ఫోన్‌కి మధ్య పెద్దగా వ్యత్యాస్యం చూడలేదు జనాలు. కాని జియో రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జియో కేవలం 4G నెట్వర్క్‌కి సంబంధించిన సేవలు అందిస్తోంది. దీనికి కారణం జియో పూర్తిగా LTE నెట్వర్క్ పైన ఆధారపడటం. అలాగే VoLTE ఉన్న ఫోన్‌కి మాత్రమే ఎలాంటి ఆప్స్ సహాయం లేకుండా జియో కాల్స్ సౌకర్యం లభిస్తోంది. కాల్స్ పక్కనపెడితే, ఇప్పుడు అందరికి అవసరమైనది 4G ఇంటర్నెట్ సర్వీసులు. వీటిని 3G ఫోన్స్ ఉన్నవారు పొందలేకపోతున్నారు. మరి ఎలా? మీ 3G ఫోన్‌ని 4G‌కి మార్చుకోవచ్చిలా.

అన్ని ఫోన్లకి ఇది సాధ్యపడదు కాని, మేం చెప్పే ఓ ట్రిక్ అయితే ప్రయత్నించి చూడండి. పని చేస్తే మీ లక్. మీ 3G మొబైల్‌లో *#*#4636#*#* డయల్ చేయండి. ఆ తరువాత మీ ఫోన్లో Phone Information, Battery Information, Usage Satistics, Wi-Fi information అనే ఆప్షన్లు కనిపిస్తే సగం పని అయిపోయినట్టే. ఆ తరువాత Phone Informationలోకి వెళ్ళి "set preferred network type"ని సెలెక్ట్ చేయండి. దాంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వాటిలోంచి LTE/GSM/CDMA auto (PRL)ని సెలెక్ట్ చేసుకోని అప్డేట్ చేయండి. ఓసారి ఫోన్ రిబూట్ లేదా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇప్పుడు ఏదైనా 4G సిమ్ వేసి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతోందో లేదో పరీక్షించండి. అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే, మీరు జియో 4Gని మీ 3G ఫోన్లో వాడుకోవచ్చు.

Tuesday, June 7, 2016

మీ స్మార్ట్ ఫోన్ లో "రీసైకిల్ బిన్‌" ఆప్షన్‌ కావాలంటే ?

విండోస్ కంప్యూటర్‌లలో కనిపించే రీసైకిల్ బిన్ ఆప్షన్ గురించి మనందరికి తెలుసు. పీసీలో అవసరంలేని ఫైల్స్‌ను ఈ ట్రాష్ క్యాన్‌లోకి డంప్ చేసుకుని అవసరమైనపుడు వాటిలో కావల్సిన ఫైల్స్‌ను రీస్టోర్ చేసుకునే వీలుంటుంది. ఇక్కడ దురదృష్టకర విషయం ఎంటంటే..? మైక్రోసాఫ్ట్ అందిస్తోన్నరీసైకిల్‌బిన్ లాంటి ఫీచర్ గూగుల్ తన ఆండ్రాయిడ్ ఫోన్‌లకు అందించలేకపోతోంది.
 
 మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో విండోస్ తరహా రీసైకిల్‌ బిన్ ఆప్షన్ కావాలా..? ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ కనిపిస్తోంది. మరి ఇలాంటపుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఇష్టంగా ఉంచుకున్న డేటా అనుకోకుండా డిలీట్ అయిపోతే ఏం చేస్తారు..? ఈ సమస్యకు సమాధానమే Dumpster App .ద రీసైకిల్ బిన్ ఫర్ ఆండ్రాయిడ్ అనే ట్యాగ్ లైన్‌తో వస్తోన్న ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ బెస్ట్ రీసైకిల్ బిన్ గా వ్యవహరించగలదు. ఈ యాప్ ద్వారా ఫోన్‌లో డిలీట్ అయినా డేటాను తిరిగి రికవరీ చేసుకునేందుకు వీలుంటుంది. యాప్ ప్రత్యేకతలను తెలుసుకుందాం...

Dumpster App గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉంది. ఈ యాప్‌‌ను మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఎంచక్కా మీ రీసైకిల్ బిన్‌ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.


Dumpster యాప్, మీరు మీ ఫోన్‌లో డిలీట్ చేసే ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, అవసరమైనపుడు మీరు వాటిని తిరిగి రీస్టోర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఫోన్‌లో మీరు డిలీట్ చేసే ఫైల్స్‌ను భద్రంగా స్టోర్ చేసే Dumpster యాప్ మీ ముందు రెండు ఆప్షన్‌లను ఉంచుతుంది. అందులో మొదటిది రీస్టోరింగ్ ఆప్షన్. అంటే మీరు డిలీట్ చేసిన ఫైల్స్‌‍లో అవసరమైన వాటిని తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చన్నమాట. మరొక ఆప్షన్ శాస్వతంగా డిలీట్ చేయటం. అంటే డిలీట్ చేసిన ఫైల్స్‌ను శాస్వతంగా ఫోన్ నుంచి తొలగించటమనమాట.
యాప్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ఫైల్స్‌ను ఎంపిక చేసుకోటం ద్వారా Dumpster ఆ ఫైల్స్‌కు సంబంధించిన క్యాచీని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఫైల్స్‌ను వైరస్ దాడుల నుంచి కాపాడుతుంది.

Dumpster యాప్ ప్రీమియమ్ వర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. ప్రీమియమ్ వర్షన్ యాప్ క్లౌడ్ బ్యాకప్‌తో పాటు యాడ్ ఫ్రీ ఇంటర్‌ఫేస్ అందిస్తుంది. ఏడాదికి రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది.


Tuesday, February 2, 2016

ఆ లింక్ పై క్లిక్ చేస్తే, మీ ఫోన్ నాశనమే ?

స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ ఓ మోసపూరిత వైరస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆకర్షణీయమైన ఆఫర్ల ముసుగులో CrashSafari.com అనే అడ్రస్‌తో వస్తున్న ఈ లింక్ పై క్లిక్ చేసినట్లయితే స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామింగ్ మొత్తం దెబ్బతింటుంది.


వెంటనే ఫోన్ రీస్టార్డ్ ఆప్షన్‌లోకి వెళ్లిపోతోంది. దీంతో మీ స్మార్ట్‌ఫోన్‌లోని వ్యక్తిగత డేటా ఇంకా యాప్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. CrashSafari లింక్ వ్యక్తిగత కంప్యూటర్ల కంటే స్మార్ట్‌ఫోన్‌ల పై వేగంగా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఫ్రెండ్స్.. అర్థంకాని భాషలో వచ్చే మెసేజ్ లింక్స్ పై క్లిక్ చేయకండి.




Saturday, November 21, 2015

"కార్డు" లేకుండా ఏటీఎం నుంచి డబ్బు !

ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు తీసుకునే కొత్త టెక్నాలజీ మిషిన్‌లను చైనా ప్రారంభించింది. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి... మన ముఖమే ఏటీఎం కార్డులా పని చేస్తుంది! తాజా టెక్నాలజీ ద్వారా జేబులో పెట్టుకోవాల్సిన ఏటీఎం కార్డుతో అవసరమే ఉండదు. కార్యాలయంలో అటెండెన్సు కోసం వాడే బయోమెట్రిక్ సాంకేతిక.. ఐరిస్ ఆధారంగా హాజరు పడుతుంది. దానినే కొంచెం మార్చి ముఖాన్ని గుర్తించి, ఒక పాస్ వర్డ్ అడిగి, దానిని బట్టి ఖాతాకు సంబంధించిన కార్యకలాపాలు చేసుకునే సరికొత్త టెక్నాలజీని చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ఇలాంటి పది మిషన్లను చైనా మర్చంట్ బ్యాంక్ వివిధ నగరాలలో ఏర్పాటు చేసింది. ముఖాన్ని స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన బ్యాంకు కార్యకలాపాలను ఈ మిషన్ల ద్వారా నిర్వహించుకోవచ్చు. టెలిఫోన్ నెంబర్లను కూడా పాస్ వర్డుగా ఎంటర్ చేయాలి. మరో విషయమేమంటే... అచ్చం ఒకేలా ఉండే కవలు ఇద్దరు వచ్చినా కూడా వాళ్లలో ఎవరి అకౌంటును వాళ్లకే యాక్టివేట్ చేసేలా ఈ సాంకేతికత ఉంది. కళ్లజోడు పెట్టుకున్నా, మేకప్ వేసుకున్నా మీ ముఖాన్ని గుర్తిస్తుంది. దీని ద్వారా కేవలం 42 సెకన్లలోనే డబ్బు డ్రా చేసుకోవచ్చు.



Friday, June 19, 2015

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకునేందుకు సింపుల్ చిట్కాలు !


1) ఇంటర్నల్ మెమరీ తక్కువుగా ఉందా?
పరిష్కారం: ఫోన్‌లో పేరుకుపోయి ఉన్న బ్రౌజింగ్ హిస్టరీతో పాటు క్యాచీలను తొలగించటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ మెమరీని పెంచుకోవచ్చు.

2) బ్లూటూత్ పని చేయటం లేదా?
పరిష్కారం: ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి రిస్టార్ట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది. బ్లూటూత్ షేర్ క్యాచీని తొలగించటం ద్వారా బ్లూటూత్ అంతరాయం లేకుండా పనిచేస్తుంది.

3) బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతోందా?
 పరిష్కారం: ఫోన్‌లోని కనెక్టువిటీ ఫీచర్లుతో పాటు బ్యాక్ గ్రౌండ్ అప్లికేషన్‌లను నిలిపి వేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

4)  ఆండ్రాయిడ్ ఫోన్ మెమరీ కార్డును గుర్తించటం లేదా?
 పరిష్కారం: సదరు మెమరీ కార్డును ఫార్మాట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది. ఇలా చేయాలంటే.. Go to settings > Storage > Format SD card > Ok


5) ఫోన్ సిమ్‌కార్డ్‌‌ను గుర్తించటం లేదా?
 పరిష్కారం: ముందుగా వేరే సిమ్‌లను వేసి ప్రయత్నించిండి. ఒకవేళ సమస్య మీ సిమ్ కార్డ్‌లో ఉంటే పరిష్కరించుకోవచ్చు. మీరు అడాప్టర్‌తో కూడిన మైక్రోసిమ్‌ను వినియోగిస్తున్నట్లయితే నానో సిమ్‌గా మార్చి ప్రయత్నించండి.

6) కెమెరా స్టార్ట్ అవటం లేదా?
 పరిష్కారం: ముందుగా సెట్టింగ్స్‌లోని యాప్స్ మెనూలోకి ప్రవేశించి కెమెరా యాప్‌ను సెలక్ట్ చేసుకోండి. కెమెరా యాప్ ఓపెన్ అయిన తరువాత ‘Force stop' ‘clear data', ‘clear cache' ఆప్షన్‌లను ‘Apply' చేయండి. చాట్ మెసెంజర్స్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి కెమెరాను యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసే ముందు ఓసారి వాటిని తొలగించి చూడండి. సమస్యకు పరిష్కారం లభించవచ్చు.

7) బ్యాటరీ చార్జ్ అవటనాకి ఎక్కువ సమయం పడుతోందా?
 పరిష్కారం: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవటానికి ఎక్కువ సమయం తీసకుంటుందా..? అయితే ఇది హార్డ్‌వేర్ సమస్యే, చార్జర్‌కు సంబంధించిన యూఎస్బీ కేబుల్‌ను మార్చటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

8) ఫోన్ హ్యాంగ్ అయిన సమయంలో ఏం చేయాలి ?
 పరిష్కారం: రీస్టార్ట్ చేయటం ద్వారా ఫోన్ ను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. తరచూ ఇలాను జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయవల్సిందే.











Thursday, May 14, 2015

ఫోనే "తాళం"లా పనిచేస్తే ?


Wednesday, April 15, 2015

ఇకపై "రైళ్లలో హాయిగా నిద్రపోవచ్చు" ?


ఇకపై రైళ్లలో హాయిగా నిద్రపోవచ్చు.. స్టేషన్ దాటిపోయే సమస్యే లేదు! ఎందుకంటే ఐఆర్ సీటీసీ, భారత్ బీపీవో సంస్థలు సంయుక్తంగా సరికొత్త సౌకర్యాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నాయి. ఈ సరికొత్త సౌకర్యం ప్రకారం దిగాల్సిన స్టేషన్‌కు సరిగ్గా అరగంట ముందుగా అలారం కాల్ వస్తుంది. ఈ అలారం కాల్ రావడానికి ప్రయాణికులు 139 నెంబర్‌కు డయల్ చేసి అందులో 7 ఆప్షన్ ద్వారా పీఎన్ఆర్ నెంబర్, దిగాల్సిన స్టేషన్ పిన్ కోడ్, స్టేషన్ పేరు తదితర వివరాలు నమోదు చేయాలి. 
 
వాటిని నిక్షిప్తం చేసుకున్న ఐఆర్ సీటీసీ మీరు దిగాల్సిన స్టేషన్ మరో అరగంటలో చేరుకుంటుందనగా, మీకు అలెర్ట్ కాల్ చేస్తుందని, ఒకవేళ ట్రైన్ అరగంట ఆలస్యంగా ప్రయాణిస్తే, అలెర్ట్ కాల్ కూడా అరగంట ఆలస్యంగానే వస్తుందని రైల్వే అధికార ప్రతినిధి నీరజ్ శర్మ వెల్లడించారు. సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్) ద్వారా కూడా అలెర్ట్ అందించే సౌలభ్యం ఉందని నీరజ్ చెప్పారు. దీంతో రైళ్లలో దిగే స్టేషన్‌పై టెన్షన్ పడకుండా నిద్రపోవచ్చు.